ఫోటో మూమెంట్ : పవర్ స్టార్ కి నాలుగు వేలు సరిపోతాయా..?

Wednesday, November 16th, 2016, 04:00:49 PM IST

pk
పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు సామాన్యులకే కాదు పెద్ద స్టార్ లకు కూడా తప్పడం లేదు. సినీ నటుడు జనసేన అధినేత హైదరాబాద్ నగరంలోని ఓ బ్యాంక్ లో కరెన్సీని మార్చుకునేందుకు బుధవారం వెళ్లారు. దీనితో అభిమానులు ఆయనని చూడడానికి ఎగబడ్డారు. స్వయంగా పవన్ బ్యాంకు కు వెళ్లి నాలుగు వేల రూపాయలను మార్చుకున్నారు. పెద్ద నోట్ల రద్దుతో కేద్రం కొద్ది రోజులవరకు డబ్బుల డ్రా విషయం లో పరిమితి విధించిన విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడే కాదు..జనసేన పార్టీ అధినేత కూడా. అలాంటి పవన్ కు కూడా నాలుగు వేలు ఏం సరిపోతాయని బ్యాంక్ వద్ద ఉన్న జనాలు అనుకున్నారు. స్టార్లకు కూడా కరెన్సీ కష్టాలు మొదలయ్యాయన్న మాట.