కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్..!

Thursday, July 30th, 2020, 06:18:28 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతించారు. ఐదో తరగతి వరకు విద్యాబోధన మాతృ భాషలోనే జరగాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్పులు చేయడం నిజంగా గర్హనీయమని అన్నారు.

ఏపీలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు దానిని జనసేన తీవ్రంగా ఖండించిందని తమ పిల్లలు మాతృభాషలో చదవాలా లేదా ఆంగ్ల మాధ్యమంలో చదవాలా అనే విషయాన్ని తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలన్నారు. పిల్లలకు ఆంగ్ల మాధ్యమం ఇష్టంగా మాత్రమే ఉండాలని అన్నారు. మన తెలుగు భాష, మన నదుల పరిరక్షణ కొరకు ‘మన నది-మన నుడి’ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు.