బిగ్ న్యూస్ : షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ – కారణం ఏమైఉంటుంది…?

Sunday, February 9th, 2020, 07:26:39 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని, ఆ తరువాత ప్రజాసేవ మీద ఉన్నటువంటి అభిమానంతో రాజకీయాల్లోకివచ్చి, ప్రజలందరితో కలిసి మమేకం అవుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత ప్రస్తుతానికి అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా పవన్ తాజాగా హిందీలో ఘనవిజయాన్ని సాధించిన “పింక్” చిత్రాన్ని తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లకు ఐదు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారని సమాచారం.

దానికి కారణం లేకపోలేదు… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 12, 13 తేదీల్లో కర్నూలులో పర్యటించడానికి వెళ్తున్నారు. దేనికి తోడు పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అక్కడే ఉండి, అక్కడి స్థానిక నేతలతో కూడా సమావేశం కానున్నారని సమాచారం. ఆ తరువాత అంటే కర్నూలు పర్యటన తరువాత పవన్ కళ్యాణ్ అక్కడి నుండి నేరుగా రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకొని ఈనెల 15 న అక్కడి రైతులందరితో కూడా సమావేశం కానున్నారు. అయితే ఈ రాజకీయపరమైన సమావేశాలు అన్ని కూడా పూర్తయ్యాకే పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకొని, సరాసరి షూటింగ్ లలో పాల్గొంటారని సమాచారం.