పవన్ కళ్యాణ్ కి రాజకీయాల కంటే సినిమాలే బెటర్ కావచ్చు…

Wednesday, July 17th, 2019, 01:19:14 AM IST

ఏపీలో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన జనసేన పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఏపీలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా కేవలం ఒకేఒక్క స్థానంలో విజయం సాధించింది. అప్పటినుండి జనసేన పార్టీకి సంబందించిన వారు ఎవరు కూడా ఎక్కువగా బయట కనిపించడమే మానేశారు. అయితే ఆఓటమి నైరాశ్యం నుండి పూర్తిగా కోలుకున్న తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మీడియా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యి ఎన్నికల్లో బహిరంగంగా ఓడిపోయినప్పటికీ కూడా, జనసేన పార్టీ ఓట్ల కంటే ఎక్కువగా ప్రజల హృదయాలను గెలుచుకుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాకుండా ఇకనుండి రాజకీయాలకే పూర్తిగా సమయం కేటాయిస్తానని, ఇక మీదట సినిమాలు చేయబోనని పవన్ కళ్యాణ్ అందరిముందే చెప్పేశారు.

అయినప్పటికీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం మాత్రం యదావిధిగా ఎప్పటిలాగే కొనసాగుతుందని అందరు అంటున్నారు. ఎన్నికల్లో ఓటమినుండి కోలుకున్న జనసేనాని ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి, ఇకనుంచీ ప్రజల్లోనే మేము ఉంటాం అని ఎప్పటిలాగే రొటీన్ డైలాగ్ చెప్పి, మళ్ళీ ప్రజల వైపు కన్నెత్తి కాదు కదా, కనీసం కనుఱెప్ప కూడా కదల్చి చూడలేదు. రీల్ లైఫ్ లో హీరో అనిపించుకున్న పవన్ కళ్యాణ్ మాత్రంరియల్ లైఫ్లో మాత్రం అంతగా రాణించడం లేదనే చెప్పాలి. ఇకపోతే ప్రచారంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేమో చూస్తా’ అని పలికిన పవన్ కళ్యాణ్ ఇపుడు మాత్రం ఎందుకలా నిశ్శబ్దంగా ఉంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలన్నీ కూడా అబద్దాలేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

అసలు విషయానికొస్తే నిజానికి పవన్ కి రాజకీయాల్లో రాణించాలని, ప్రజలందరికి కూడా ఎంతో మేలు చేయాలనీ ఉంది. అందుకోసం సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్.. తానూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగ పాదయాత్రలు చేసి ప్రజల్లో బలంగా తయారవ్వాలని అనుకుంటున్నాడు కానీ అవేవి కూడా ఆచరణలోకి రావడం లేదని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా కేవలం భ్రమలోనే ఉంటున్నారని, ఆ భ్రమ ని వదిలి బయట ప్రపంచానికి వస్తేనే రాజకీయాల్లో ఏమైనా సాధించగలడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇలా కూడా సాధ్యం కాకపొతే పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాలను పూర్తిగా వదిలేసి సినిమాల్లోకి వెళ్లిపోవడమే బెటర్ అని అందరు అభిప్రాయపడుతున్నారు… కానీ రాజకీయాల్లో గట్టిగ రాణించాలని నిశ్చయించుకున్న పవన్ కళ్యాణ్ ఎం చేస్తాడో చూడాలి…