పవన్ ను అప్సెట్ చేసిన సంగీత దర్శకుడు?

Friday, January 20th, 2017, 10:58:45 AM IST

katamarayuda
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డాలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ”కాటమరాయుడు”. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరగా పూర్తీ చేసి మార్చ్ లో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ సంగీతం అందిస్తున్నాడు. లేటెస్ట్ గా అనూప్ ఇచ్చిన మ్యూజిక్ పై పవన్ కళ్యాణ్ అప్సెట్ అయ్యాడని, తన సాంగ్స్ అంటే ఫాన్స్ లో ఓ రకమైన క్రేజ్ ఉంటుందని ఆ స్థాయిలో ఈ సాంగ్స్ రాలేదని అన్నాడట !! పైగా ఈ సినిమాకోసం అనూప్ ఎక్కువ సమయం కూడా తీసుకున్నాడని తెలిసింది. గతంలో పవన్ – డాలి ల కలయికలో వచ్చిన ”గోపాల గోపాలా” సినిమాకు సంగీతాన్ని అందించి మంచి మార్కులు కొట్టేసిన అనూప్, కాటమరాయుడు విషయంలో మాత్రం డిస్సప్పాయింట్ చేసాడట!! మరి ఈ విషయంలో పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి?