పవన్ కళ్యాణ్ ఇలా అంటే నాగబాబు అలా అంటున్నారు !

Monday, November 21st, 2016, 09:56:28 AM IST

pawan-naga-babu
మోదీ కరెన్సీ బ్యాన్ పై చాలా ఆలస్యంగా స్పందించిన పవన్ కళ్యాణ్ మోదీ విధానం వలన నల్ల దానం బయటకి రావాడమేమోగాని పేదవాడు తీవ్రంగా నష్టపోతున్నాడని, వాళ్ళ కష్టానికి విలువ లేకుండా పోతుందని, చేసిన పనికి ఫలితం దక్కించుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారని తన స్నేహితుడు సాయి మాధవ్ బుర్ర రాసిన ఒక కవితను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో షేర్ చేశారు. అలాగే ప్రభుత్వం నోట్ల రద్దు ముందు డో ఒక జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందని, ప్రతిదీ రహస్యంగా చేయవలసిన అవసరం లేదని అంటూ కాస్త ప్రత్యక్షంగా, ఎక్కువ పరోక్షంగా మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

పవన్ నిర్ణయం ఇలా ఉంటే మరి వైపు ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు ఆలోచన పూర్తి భిన్నంగా ఉంది. మోదీ తీసుకునేం నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. ఇంతవరకూ భారత్ చరిత్రలో ఏ ప్రధాని అలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇది రాజకీయపరమైన ప్రసంశ కాదని, వ్యక్తిగతమైన అభిప్రాయమని అన్నారు. ఇలా పవన్, నాగబాబులు ఇద్దరూ వేరు వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో అభిమానులు మరోసారి కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు.