పరిశ్రమలోని ఆడపడుచులకోసం .. పవన్ కొత్త సమితి ?

Monday, April 23rd, 2018, 11:35:13 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఓ రేంజ్ లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ముక్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఓ వర్గం నానా రచ్చ చేస్తుంది. తాజగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా తెలుగు సినిమా పరిశ్రమ ఆత్మగౌరవ పోరాట సమితి ని ఏర్పాటు చేసారు. జనసేన వీర మహిళా విభాగం అండగా ఉంటుందని వెల్లడించారు. దాంతో పాటు మన తల్లులని, మనలను, ఆడపడుచులను తిట్టే పేపర్లను, ఛానల్స్ ను ఎందుకు చూడాలి ? అంటూ ప్రశ్నించారు. జర్నలిజం విలువలతో ఉన్న ఛానెల్స్, పత్రికలకె తమ మద్దత్తు ఉంటుందని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments