బోయపాటి కోసం పవన్ ప్రయత్నాలు ?

Wednesday, January 17th, 2018, 04:11:53 PM IST

పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమాతో సంచలన విజయం అందుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని పవన్ ప్లాన్ చేసాడు. అందుకే క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ తో మరోసారి సినిమాకు ప్లాన్ చేసాడు. సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ సినిమా అభిమానులతో పాటు అటు పవన్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. దాంతో మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట పవన్. అయితే ఈ సారి పక్కా సంచలన విజయంతోనే ఎన్నికలకు సిద్ధం అవ్వాలని చూస్తున్నాడట .. ఈ నేపథ్యంలో అయన బోయపాటి శ్రీను తో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే బోయపాటి శ్రీనుకు కబురు పెట్టారని టాక్ ? ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్న బోయపాటి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరి పవన్ సినిమాకు ఓకే చెప్పాడు కాబట్టి ..వెంటనే ఆ సినిమా చేస్తాడా .. లేక చరణ్ సినిమా తరువాత చేస్తాడా అన్నది చూడాలి.