బీజేపీకి ఛాన్స్ ఇస్తే పవన్ సంగతి అంతే..

Friday, June 14th, 2019, 09:56:04 AM IST

గత ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యతిరేకత పూర్తిస్థాయిలో భయపడిపోయింది. టీడీపీ 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలకే పరిమితమే పునాదులతో సహా కదిలిపోయింది. ఈ ఫలితాలతో ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని స్పష్టమైంది. ఈ ఖాళీని పూరించాలని భాజాపా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో అస్సలు ప్రభావం చూపలేకపోయినా రానున్న ఐదేళ్లలో గట్టిగా పనిచేసి టీడీపీకి ప్రత్యాన్మాయంగా ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షంగా మారాలని భావిస్తోంది.

అదే గనుక జరిగితే జనసేనకు రాష్ట్ర రాజకీయాల్లో చోటు దక్కడం కష్టమవుతుంది. కాబట్టి గత ఎన్నికల్లో కొద్ది మొత్తంలోనే ఓట్ షేర్ సాదించినప్పటికీ మూడో పార్టీగా అవతరించిన జనసేనను పవన్ ఈ ఐదేళ్లు జనంలోనే ఉండి సమర్థవంతంగా నడపగలిగితే భాజాపా కంటే వేగంగా టీడీపీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలుగుతారు. పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు కాబట్టి వాటి నుండి ప్రయోజనం పొందగలుగుతారు. అలా కాకుండా అలసత్వంతో ఉంటే అమిత్ షా, మోడీల కనుసన్నల్లో భాజాపాలో రాష్ట్రంలో నిలదొక్కుకునే ఛాన్సుంది.