పవన్ ప్రక్షాళన మొదలుపెట్టాడా ?

Wednesday, June 5th, 2019, 10:57:29 AM IST

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనసేన శ్రేణులు నిరుత్సాహంలో కూరుకుపోయాయి. పవన్ సైతం ఫలితాల రోజు రెండు నిముషాలు ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ బయటకురాలేదు. దీంతో జనసేన కార్యకర్తలు మరింత కంగారుపడ్డారు. కానీ తాజా సమాచారం మేరకు పవన్ భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళికలో మొదటిది ప్రక్షాళన అట.

అనగా గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాల్ని సమగ్రంగా అన్వేషించి వాటిని సరిద్దుకోవడం. ఈ పద్దతి పశ్చిమ గోదావరి, క్రిష్ణా జిల్లాల నుండి మొదలవుతుందట. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎక్కడ గెలిచినా గెలవకపోయినా గోదావరి జిల్లాల్లో మాత్రం అధిక స్థానాలు గెలుస్తామని పవన్ అనుకున్నారు. కానీ ఫలితం తిరగబడింది. చివరికి పవన్ సైతం ఓటమిని చవిచూశారు. దీంతో అక్కడ గేమ్ ప్లాన్ మార్చాలని చూస్తున్నారు.

ముందుగా రేపు ఆమరావతి వెళ్లి పడమటలంకలోని తన నివాసంలో జనసేనాని మీటింగ్ పెట్టనున్నారు. దీనికి పశ్చిమ గోదావరి, క్రిష్ణా జిల్లాల ముఖ్య నేతలంతా హాజరుకావలని కబురు పంపారట. మరి పవన్ ప్రక్షాళనా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో చూడాలి.