పవర్ స్టార్ అజ్ఞాతవాసి డేట్ మారిందిగా ?

Sunday, October 22nd, 2017, 10:00:10 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25 వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకోసం బాలీవుడ్ టాప్ యాక్షన్ మాస్టర్ ని దింపేశారు. భారి యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వచ్చే నెలవరకు షూటింగ్ ని పూర్తీ చేసి మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా వేగం పెంచాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇక సినిమాను ఇదివరకే ట్రైలర్ లో ప్రకటించినట్టు జనవరి 10 న కాకుండా ఒకరోజు ముందే .. అంటే 9న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం అజ్ఞాతవాసి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా విడుదల తరువాత పవన్ కళ్యాణ్ జనసేన పనుల్లో బిజీగా మారతాడని టాక్ ? కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ లో ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments