తాను నీతులు చెప్తాడు కానీ పాటించడు..సైనికుల చెత్త లాజిక్కులు!

Sunday, December 15th, 2019, 03:13:56 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసే పనులు ఎవరికీ అర్ధం కావు అనడానికి ఇప్పుడు మరో ఘటన అద్దం పట్టింది.అయితే దాని కంటే ముందు పవన్ కోసం కొన్ని విషయాలు చర్చించాలి.పవన్ ఏపీలో ఉన్న ఇతర రాజకీయ నాయకులకు అతీతం.ఇది అందరికి తెలుసు.అలాగే ఆ ఇతర నాయకులలో లేని గొప్ప లక్షణాలు కూడా తనలోనే ఉన్నాయి అని చెప్తారు.కొన్ని కొన్ని విషయాల్లో అవి ప్రూవ్ చేసుకున్నారు కూడా.కొన్ని సందర్భాల్లో చాలా క్లారిటీగా మాట్లాడుతారు.అలాగే తాను ఒకసారి ఫిక్స్ అయితే చాలా మొండిగా కూడా ఉంటారని అందరికి తెలుసు.

అలా ఇతర రాజకీయ నాయకులకు విభిన్నంగా మా నాయకుడు ఉంటాడని పవన్ లా అయితే మీ పార్టీ అధినేత ఒక్క రోజు కూడా ఉండలేడు అని ఓ..ఎలివేషన్లు జనసైనికులు ఇస్తారు.అయితే అలా వారు చెప్పడంలో తప్పేమీ లేదు.అలా అని పవన్ చేసిన ప్రతి పనిని కూడా మొయ్యడం ఎంత వరకు కరెక్ట్ అన్నది వారు ఓ సారి నిశితంగా ఆలోచించుకోవాలి.ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పవన్ ను సోషల్ మీడియాలో చాలా మంది మంచి రాజకీయ అవగాహన ఉన్న జనసైనికులు ఫాలో అవుతుంటారు.

అలాగే పవన్ ఏ పని చేసినా సరే కేవలం దానిలోని పాజిటివ్ నెస్ ని మాత్రం చూపించాలని తీవ్రంగా శ్రమిస్తారు.అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు.గతంలో పవన్ తల్లిని దూషించారని చెప్పి దానిని ఓ ప్రముఖ ఛానెల్ వారు పత్రిక వారు చేసిందే పది సార్లు టెలికాస్ట్ చేసారని పవన్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.అలా ఆయా ఛానెల్ ను బాయ్ కాట్ చెయ్యాలని తన అభిమానులకు పిలుపునిచ్చి రచ్చ లేపేశారు.ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే చంద్రబాబును మోసే ఛానెల్ పత్రికకు ఒక పేజీ నిండా పెద్ద ఇంటర్వ్యూ ను ఇచ్చారు.ఏంటిది?

తానేమో ముందు ఒకటి చెప్తాడు అభిమానులను కూడా అదే చెయ్యమంటాడు కానీ తాను మాత్రం తన విలువలను ఎప్పుడైనా పక్కన పెట్టేస్తాడు.ఇలాంటప్పుడు వ్యక్తిత్వం ఎక్కడ ఉంది?ఈ చర్యతో సోషల్ మీడియాలో జగన్ అభిమానులు గతంలో ఏదైతే పేపర్ మరియు ఛానెల్ ను బాయ్ కాట్ చెయ్యమని చెప్పాడో ఇప్పుడు అదే పేపర్ కు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడని ప్రశ్నలు వేస్తుంటే దానికి సైనికుల లాజిక్కులు ఇలా ఉన్నాయి.

గతంలో జగన్ కూడా ఓ బడా ఛానెల్ ని ఎన్నోసార్లు తిట్టి పోసి సరిగ్గా ఎన్నికల ముందు అదే ఛానెల్ కు ఎలా ఇంటర్వ్యూ ఇచ్చాడని లాజిక్ మాట్లాడుతున్నారు.అంటే వీరి దృష్టిలో జగన్ మరియు పవన్ ఒకటే అని చెప్పకనే చెప్పుకున్నారు.అంతే కాకుండా వ్యక్తిత్వంలో పవన్ కి జగన్ కి పెద్ద తేడా లేదని వీరే ఒప్పుకున్నట్టు చేసారు.మరి ఈ లాజిక్కును సైనికులు ఎలా మిస్సయ్యారో..