ట్విట్టర్ లో భారీ రికార్డు ను నమోదు చేసిన పవన్ కళ్యాణ్ ఫాన్స్..

Monday, September 3rd, 2018, 05:39:29 PM IST

సెప్టెంబెర్ 2వ తేదీ అనగా నిన్న ట్విట్టర్ వేదిక గా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వినీ ఎరుగని రీతిలో వారి అభిమానాన్ని వారి అభిమాన హీరో మీద చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ట్విట్టర్ వేదికగా మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రతి ఒక్క హీరో అభిమానులు వారి హీరోయొక్క పుట్టిన రోజు వేడుకల్ని బయట కన్నా ఈ సోషల్ మీడియా వేదిక గా చాలా ప్రతిష్టాత్ర్మకంగా తీసుకుంటారు.. అదే విధంగా సరిగ్గా ఒక్కరోజు ముందు వారి ట్విట్టర్ అకౌంట్ లో ఒక ప్రత్యేకమైన టాగ్ ని పొందుపరిచి దాని భారత దెస వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా ట్రేండింగ్ లో ఉండేలా చేస్తారు..

కానీ ఈ విషయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్క ఎప్పుడు ముందే ఉంటారు అని మళ్ళీ నిరూపించుకున్నారు. ఇది వరకు వారి పేరిట ఉన్న అత్యధిక రికార్డు 2.9 లక్షల ట్వీట్లను మహేష్ బాబు గారి అభిమానులు అతని పుట్టిన రోజు సందర్భంగా 4.6 లక్షల ట్వీట్లతో బద్దలుకొట్టారు. అయితే ఈ రికార్డును పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరి హీరోలలా తమ అభిమాన నటుడు నుంచి ఫస్ట్ లుక్ గాని టీజర్ లు గాని ఉండవని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్కొని మహేష్ బాబు గారి పేరిటఉన్న రికార్డు ని కేవలం కొద్దీ రోజుల్లోనే 7.4 లక్షల ట్వీట్లను ఎవ్వరు ఊహించని విధంగా భారీ మొత్తం లో నమోదు చేశారు.. “ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గత మూడు సంవత్సరాల నుంచి ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజున పేరిటనే ముందంజలో ఉంటున్నారు”

  •  
  •  
  •  
  •  

Comments