నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల వల్లేనా జగన్ రెండేళ్లు జైల్లో ఉంది.?

Tuesday, November 12th, 2019, 05:16:34 PM IST

తాజాగా ఏపీ సర్కార్ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయ పార్టీల్లో పెద్ద దుమారమే రేపుతోంది.తెలుగు భాషను తీసేసి ఇంగ్లీష్ మీడియంను తీసుకురావాలని అది అవసరం ఉందని జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు “వైసీపీ వర్సెస్ జనసేన” వార్ గా తయారయ్యింది.అయితే దీనిపై వైసీపీ నేతలు గత కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్స్ తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో తీవ్ర స్థాయి విమర్శలు వచ్చాయి.

అయితే ఎక్కువ జనసేన పార్టీ శ్రేణులు దీనిని లేవనెత్తుతుండడంతో వైసీపీ అధిష్ఠానం వారికి కౌంటర్ ఇస్తూ వస్తుంది.అయితే వారు పవన్ ను ఉద్దేశించి చేసే విమర్శలలో అత్యధికంగా అతని మూడు పెళ్ళిళ్ళను ఉద్దేశించే ఉంటున్నాయి.అందులో భాగంగా నిన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి.

దీనితో పవన్ ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చారు.తాను వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయికి దిగజారిపోలేదని తెలుగు వాడిగా నా తల్లిదండ్రులు అలాంటి సంస్కారం నేర్పించలేదని చురకలంటించారు.ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా జగన్ వైసీపీ నాయకులిలా చిల్లరగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.ఇంకా నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వలనే జగన్ గారు రెండేళ్లు జైల్లో ఉన్నారు అంటూ తనదైన శైలి కౌంటర్లు ఇచ్చారు.