పీసీ `క్వాంటికో` ప్రోమో స్ట‌న్నింగ్‌

Friday, April 6th, 2018, 07:07:06 PM IST

`క్వాంటికో` సిరీస్‌తో ప్రియాంక చోప్రా పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇండియాతో పాటు పాశ్చాత్య దేశాల్లోనూ పీసీకి అసాధార‌ణ ఫాలోయింగ్ పెర‌గ‌డానికి ఈ సిరీస్ ఉప‌యోగ‌ప‌డుతోంది. ప‌లు హాలీవుడ్ చిత్రాల్లోనూ పీసీకి అవ‌కాశాలు రావ‌డానికి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క టీవీ సిరీస్ కార‌ణం. ఈనెల 26 నుంచి క్వాంటికో కొత్త సీజ‌న్ ఏబీసీ చానెల్‌లో టెలీకాస్ట్ కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్ప‌టికే షూటింగుల్లోనూ పాల్గొంటోంది పీసీ. డిటెక్టివ్ అలెక్స్ ప్ర‌శాంత జీవ‌నంలో ఊహించ‌ని మ‌లుపులు ఏంటి? అన్న‌ది ఈ కొత్త సిరీస్‌లో చూపిస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన క్వాంటికో ప్రోమోలో పీసీ స్టన్నింగ్ విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. అలెక్స్ ఈజ్ బ్యాక్‌! అన్న క్యాప్ష‌న్‌తో ఈ ప్రోమోని పీసీ సామాజిక మాధ్య‌మంలో షేర్ చేసింది. ఈ సిరీస్‌లో తాజా సీజ‌న్ కాకుండా, త‌దుప‌రి తెర‌కెక్కించ‌నున్న‌ కొత్త సీజ‌న్‌కి పీసీ అందుబాటులో ఉంటుందా? అన్న డిబేట్ ఇప్ప‌టికే మొద‌లైంది. అందుకు కార‌ణం పీసీ తిరిగి బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండ‌డ‌మే. ఈసారి స‌ల్మాన్ ఖాన్ `భ‌ర‌త్‌` మూవీలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. పీసీ ఇప్ప‌టివ‌ర‌కూ భ‌ర‌త్‌లో న‌టిస్తున్న విష‌యాన్ని క‌న్ఫామ్ చేయ‌లేదు. అలాగ‌ని ఖండించ‌నూ లేదు .. కాబ‌ట్టి కొంత‌కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది.