పిక్ టాక్‌ : పీసీ వ‌ర‌స్ట్ డ్రెస్సింగ్ సెన్స్‌?

Thursday, May 10th, 2018, 02:20:57 PM IST

అప్ప‌డ‌ప్పుడు ఫ్యాష‌న్ & ట్రెండ్స్ ప‌రాకాష్ట‌లో ఎలివేట్ అవుతుంటాయి. ఇదిగో ఇక్క‌డ ప్రియాంక చోప్రా అలియాస్ పీసీ ధ‌రించిన డ్రెస్ చూస్తే ఓ సంగ‌తి అర్థం కావాలి. లూజ్ మోడ‌ల్ కాట‌న్ డ్రెస్ అంటూ స‌మ్మ‌ర్ వేళ మ‌రీ ఇంత లూజు డ్రెస్సు ఎవ‌రైనా కుట్టించుకుంటారా? ఏదో కంఫ‌ర్ట్ వ‌ర‌కూ ఓకే కానీ.. మ‌రీ ఈ ఫ్యాష‌నేంటండీ బాబూ?

పైగా ఈ డ్రెస్ కోసం పీసీ ఖ‌ర్చు చేసింది ఎంతో తెలుసా? ప‌ర్సులోంచి క్రెడిట్ కార్డు తీసి ఖ‌రీదైన షాపింగ్ మాల్‌లో 1.26 ల‌క్ష‌లు చెల్లించిందిట‌. ఆ ఖ‌రీదుకు త‌గ్గ డ్రెస్సేనంటారా? ఇది. ఇందులో మ‌రీ అంత ఏం ఉంది? సెల‌బ్రిటీ కాబ‌ట్టి అంత పోసి కొంది కానీ, అదే మ‌న మంగ‌ళ‌గిరి పిన్ని కానీ, పెద్దాపురం పెద్ద‌మ్మ కానీ కొన‌గ‌ల‌రంటారా? న‌లుగురైదుగురు బోయ్‌ఫ్రెండ్స్‌ని ఏక‌కాలంలో మోసం చేస్తే కానీ ఇలాంటి డ్రెస్సులు కొన‌డం క‌ష్టం. అయితే పాశ్చాత్య దేశాల్లో డాల‌ర్లు కొల్ల‌గొడుతున్న పీసీకి ఇదేమంత పెద్ద విష‌యం కాద‌నుకోండి. క్వాంటికో సిరీస్‌లో సంపాదించిన కోట్లాది రూప‌పాయ‌ల పారితోషికం ఇలా మంచి నీళ్లులాగా ఖ‌ర్చు చేస్తుంద‌ని అనుకోవ‌చ్చు.

🌸🌼

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

  •  
  •  
  •  
  •  

Comments