తమిళంలో కూడా నా సావు నే సస్తానంటున్న కమెడియన్ ?

Saturday, October 21st, 2017, 11:54:23 PM IST

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న పెళ్లి చూపులు సినిమా గురించి అందరికి తెలుసుగా. ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన ఈ సినిమాకు క్రేజ్ మాములుగా రాలేదు .. భారీ మొత్తానికి రీమేక్ హక్కులు అమ్ముడయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ కానుంది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఇక కౌశిక్ పాత్రలో నూతన నటుడు ప్రియదర్శి .. సరికొత్త భాషతో ఆకట్టుకున్నాడు .. ఇప్పుడు తమిళ రీమేక్ లో కూడా ప్రియదర్శి పాత్రను ఆయనతోనే చేయిస్తున్నారట. ఎందుకంటే ఆ పాత్ర అంత కామెడీని పండించింది మరి. నాసావు నేను చస్తా అంటూ ప్రియదర్శి కౌంటర్లు బాగా పేలాయి .. అందుకే ఆయనను తమిళంలోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు. ఈ మద్యే మహేష్ స్పైడర్ లో నటించిన ప్రియదర్శి ని తమిళ ప్రేక్షకులు సులభంగా రీసివ్ చేసుకుంటారన్న నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ స్లాంగ్ లో ఆకట్టుకున్న ప్రియదర్శి .. తమిళ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ రామస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.