నానీని కాపీ కొడుతున్న త్రివిక్రం, ఎన్టీఆర్..

Saturday, May 5th, 2018, 02:28:30 PM IST

ఈ మ‌ధ్య టాలీవుడ్ హీరోలు పాత్ర‌లోనే కాదు భాష‌లోను వైవిధ్యం చూపిస్తున్నారు. రెగ్యుల‌ర్ లాంగ్వేజ్ కాకుండా తెలంగాణ‌, రాయ‌లసీమ‌, ఆంధ్రా స్లాంగ్‌ల‌లో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్కిస్తున్నారు. ఈ మ‌ధ్య వ‌చ్చిన కృష్ణార్జున యుద్ధం చిత్రంలో నాని చిత్తూరు జిల్లా స్లాంగ్‌లో మాట్లాడి అభిమానుల‌ని ఆనంద‌ప‌ర‌చాడు. ఇంక ఈ చిత్రంలో ‘దారి చూడు దుమ్ము చూడు’ అంటూ ఓ మాస్ సాంగ్‌ని పెంచ‌ల్ దాస్‌చే పాడించి ప్రేక్ష‌కుల‌కి పసందైన విందు అందించారు మేక‌ర్స్‌. ఇప్పుడు తార‌క్‌- త్రివిక్ర‌మ్ సినిమాలోను పెంచల్ దాస్‌తో ఓ ఫోక్ సాంగ్ పాడించ‌నున్నార‌ని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఈ చిత్రంలో పూర్తి రాయ‌ల‌సీమ స్లాంగ్‌లోనే మాట్లాడ‌నున్నాడ‌ట‌. ఇటీవ‌ల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే నెలాఖ‌రులో రెండో షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నుంది. తొలి షెడ్యూల్‌లో అద్భుత‌మైన యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించాడు త్రివిక్ర‌మ్‌. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

  •  
  •  
  •  
  •  

Comments