ఎంఎల్ఎ, ఎంఎల్‌సీల‌కు పెన్షన్ రద్దు చేయాలి!

Friday, February 17th, 2017, 12:21:47 AM IST


ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు పెన్ష‌న్లు ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వోద్యోగులు ఉద్య‌మం చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. అయితే దీనికో ప్ర‌త్యేక‌మైన కాజ్ తెర‌పైకొచ్చింది. అదేమంటారా?

2004 సెప్టెంబర్ తరువాత చేరిన ఉధ్యోగులకేమో పాత పెన్షన్ లేదా కొత్త పెన్షన్ అమలు చేయాలంటూ రూల్స్ పెడుతున్నారు. మరి 2004 తరువాత ఎన్నికైన ఎమ్.ఎల్.ఏ.లు, ఎమ్.ఎల్.సీ లకు మాత్రం ఏకంగా రూ.50000/- పెన్షన్ ఇస్తారా? సి.పి.ఎస్. ఉద్యోగులు ఎంత దురదృష్టవంతులు ? అంటూ ఉద్యోగుల్లో క‌దలిక మొద‌లైంది. ఇది ఉద్య‌మ‌రూపం దాలుస్తుందేమో!