ఫించన్లు నగదు రూపంలోనే!

Monday, September 29th, 2014, 04:48:42 PM IST


ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు హైదరాబాద్ లో సోమవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం రుణమాఫీపై విధివిధానాలను రూపొందిస్తామని వివరించారు. అలాగే రుణమాఫీ కోసం బడ్జెట్ లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించామని, అదనంగా మరికొంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని యనమల పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ అక్టోబర్ 2 నుండి అమలు కాబోతున్న కొత్త ఫించన్ల పధకానికి 5,400కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. దీనికోసం కేంద్రం నుండి 400కోట్లు వస్తాయని, అక్టోబర్ నెలలో ఫించన్లను నేరుగా నగదు రూపంలో చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇక గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తామని, ఎర్ర చందనం అమ్మకాలపై హైకోర్టులో పిటీషన్ వేస్తామని యనమల రామకృషుడు స్పష్టం చేశారు.