బిగ్ న్యూస్ : పవన్ కళ్యాణ్ ఓడిన నియోజకవర్గంలో కష్టాలు..!

Sunday, May 24th, 2020, 09:11:04 AM IST

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో భారీ అంచనాలు నడుమ పోటీ చేసి రెండు నియోజకవర్గాల్లోని ఓటమి పాలయ్యారు. నిన్నటితో ఆ ఘోర పరాజయానికి ఒక సంవత్సరం పూర్తయ్యింది. తాను పోటీ చేసిన గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాలలో ఒకవేళ తాను గెలిస్తే ఏ స్థాయిలో అభివృధ్ధి చేస్తారో అప్పుడు గట్టిగానే చెప్పారు.

కానీ ఆ రెండు చోట్లా కూడా అనూహ్యంగా వైకాపా అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారు. దీనితో పవన్ కు రెండు చోట్లా పరాభవం తప్పలేదు. మరి ఈ గడిచిన ఏడాదిలో వారు ఆ నియోజకవర్గాలను ఎంతలా అభివృద్ధి చేశారో కానీ పవన్ కు బాగా పట్టు ఉన్న భీమవరం నియోజకవర్గ పరిసరాలలో ఈ కరోనా కష్ట కాలం లో వలస కార్మికులు చాలా ఇక్కట్లు పడుతున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా అక్కడ ఉన్న ఆక్వా కంపెనీల అకృత్యాలు దారుణంగా ఉంటున్నాయట. పని కోసం పిలిపించుకున్న కార్మికులకు కనీసం భోజనం పెట్టకపోగా వారిని తమ స్వస్థలాలకు పంపకుండా అనేక యాగీలకి గురి చేస్తున్నారని తెలుస్తుంది. మరి అక్కడ గెలవకపోయినా పవన్ వారికోసం ఏమైనా చేస్తారో లేదో చూడాలి.