ముఖ్యమంత్రిగారు..ప్రజలగోడు వినండి

Sunday, October 19th, 2014, 09:48:41 PM IST

Errabelli-Dayakar-Rao
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో సామాన్యులు, విద్యార్ధులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజలగోడు పట్టించుకోకుండా విహారయాత్రలు చేస్తున్నారని ఎర్రబెల్లి ద్వజమెత్తారు. రాష్ట్రంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉన్నదని… విద్యుత్ కోసం కేంద్రాన్ని సంప్రదించకుండా.. విద్యుత్ సమస్యలకు గతప్రభుత్వాలను నిందిస్తూ కూర్చుంటే.. సమస్యలు తీరవని ఆయన తెలిపారు. విద్యార్ధులకు ఇంతవరకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. దీంతో విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు.