సెల్ఫీలు తీసుకునే వారంతా అలాంటి వారేనట

Saturday, April 9th, 2016, 12:44:29 AM IST


సెల్ఫీ .. సెల్ఫీ.. ఈ పదం తెలియని వారు వినని వారు ఈరోజుల్లో ఉండరేమో. పదేళ్ళ కుర్రాడి నుండి 70 ఎల్లా ముసలాళ్ళ వరకూ అందరూ ఈ సెల్ఫీలకు సెల్యూట్ చేస్తున్నవాళ్ళే. ఈ సెల్ఫీ అన్న ట్రెండును ఊతంగా చేసుకుని మొబైల్ కంపెనీలు వేల కోట్లలో బిజినెస్ చేస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రతి అరగంటకో సెల్ఫీ తీసి సోషల్ సైట్ లో అప్ లోడ్ చేసి ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు వచ్చాయో నిమిశానికోసారి చూస్తుంటారు సెల్ఫీ జనాలు.

తాజాగా ఇలాంటి సెల్ఫీ ప్రియులపై జరిగిన పరిశోధనలో వాళ్ళ వ్యక్తిత్వాలే బయటపడ్డాయి. ఎక్కువగా సెల్ఫీలు తీసుకుని సోషల్ సైట్లలో పెట్టే వాళ్ళు సాధారణంగా ఆహంకారులై ఉంటారని ఈ పరిశోధన చెబుతోంది. అందంలో గాని, స్టైల్లో గాని తామే బెస్ట్ అని అహంకారానికి పోతూ ఇతరులను తక్కువగా చూసే వారే ఎక్కువగా సెల్ఫీలు పెడుతుంటారని తేలింది. కనుక ఇకపై మీరెవరైనా సెల్ఫీ దిగి సోషల్ సైట్లలో పెట్టేప్పుడు మీకు అహంకారం ఉందా.. లేదా అనే విషయాన్ని ఆలోచించండి.