పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు – పేర్ని నాని

Monday, April 5th, 2021, 12:00:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రక్రియ నేపథ్యం లో ప్రచారం లో భాగం గా పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్ధి తరపున పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం పట్ల, వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ కి చెందిన నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఉత్తరాది బీజేపీ దక్షణాది కి అన్యాయం చేస్తోంది అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేశారు మంత్రి పేర్ని నాని. అయితే ఇప్పుడే అదే బీజేపీ కి మద్దతు ఇవ్వడం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాష్ట్రం లో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్దం కేసులలో బీజేపీ ప్రమేయం ఉందని, అందుకే సీబీఐ కోరినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఈ మేరకు పవన్ కళ్యాణ్ పై సైతం మంత్రి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కాదు అని, అజ్ఞాన వాసి అని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కేసును సీబీఐ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం జగన్ ను విమర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారు అని అన్నారు. అయితే ప్రత్యేక హోదా పై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు అని, విశాఖ ఉక్కు ను అమ్మేస్తాం అని అంటున్నా బీజేపీ ను ఎందుకు ప్రశ్నించరు అంటూ మంత్రి పేర్ని నాని వరుస ప్రశ్నలు సంధించారు.