చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని..!

Saturday, February 15th, 2020, 02:55:50 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఐటీ శాఖ దాడులపై చంద్రబాబు ఆయన తనయుడు లొకేశ్ స్పందిచాలని డిమాండ్ చేశాడు. ఈ దాడులతో చంద్రబాబు అవినీతి బండారం బయటపడిందని అన్నారు.

అయితే నూరుగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోతుందన్న సామెత తనకు గుర్తుకు వస్తోందని, చంద్రబాబుకు అదే గతి పడుతుందని అన్నారు. ప్రజలు పన్నులు కట్టిన ప్రజాధనాన్ని కూడా చంద్రబాబు నాయుడు లూఠీ చేశారని అన్నారు. పీఎస్‌ ఇంట్లో దాడులు చేస్తేనే రూ.2వేల కోట్లు తేలాయని, చంద్రబాబు, లోకేశ్‌లపై దాడులు జరిపితే ఎన్ని లక్షల కోట్లు తేలుతాయో అని ఎద్దేవా చేశారు. ప్రజలపై పడిన రూ.3 లక్షల కోట్ల అప్పులలో ఎక్కువ సొమ్ము చంద్రబాబు జేబుల్లోకి వెళ్ళిందని అన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయని అన్నారు.