త్రివిక్రమ్ ని అందుకే డాడీ అని పిలుస్తుంటా: పీటర్ హెయిన్స్

Monday, December 4th, 2017, 12:18:52 PM IST

ప్రముఖ స్టంట్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఫైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులతో హీరోలతో ఆయన వర్క్ చేశారు. ఎన్నో గొప్ప సినిమాలకు యాక్షన్ సీన్స్ ను అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఎక్కువగా వర్క్ చేశారు. అయితే తాను మాత్రం ఎక్కువగా ఇష్ట పడేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలనే అని పీటర్ చెబుతున్నాడు.

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పీటర్ హెయిన్స్ త్రివిక్రమ్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకున్నాడు. ఆయన సినిమాలకు వర్క్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కథను బట్టి ఫైట్స్ కావాలని కోరతారు. అలా చేస్తేనే ఆ సీన్స్ కి అర్ధం ఉంటుంది. ఎదో కావాలని ఫైట్స్ పెడితే బావుండదు. ఆ విధంగా త్రివిక్రమ్ ఆలోచిస్తుంటారు. మా నాన్న నేర్పించిన మార్షల్ ఆర్ట్స్ నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచింది. ఇక త్రివిక్రమ్ దగ్గరి నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అందుకే ఆయన్ను ప్రేమగా డాడీ అని పిలుస్తుంటాను అని పీటర్ హెయిన్స్ వివరించాడు.

  •  
  •  
  •  
  •  

Comments