మాజీ స్పీకర్ మృతిపై తెలంగాణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు

Saturday, September 21st, 2019, 03:00:08 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. కాగా కోడెల మృతి పై స్బి విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అయితే కోడెల మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయని పిటిషనర్ ప్రస్తావించారు. ఇకపోతే కోడెల ను హత్య చేసి చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలను వైసీపీ నేతలందరూ కూడా కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు కావాలనే శవ రాజకీయాలను చేస్తున్నారని, ఇకనైనా తన నాటకాలను తగ్గించాలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇకపోతే కోడెల మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాకుండా కోడెల కుమారుడే కోడెలని హత్య చేశాడని అనుమానిస్తున్నాడని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇకపోతే ఇదేమి ముమ్మాటికీ హత్యే అని టీడీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాగా ఈమేరకు తెలంగాణ న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరు కూడా ఎదురు చూస్తున్నారు.