షాకింగ్ : జగన్ నుండి రోజాకి ఫోన్ కాల్ – మంత్రి పదవి ఖాయమేనా…?

Friday, June 7th, 2019, 11:11:45 PM IST

ఈనెల 8న జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ గతకొంత కాలంగా మంత్రి పదవి కోసమే ఎదురు చూస్తున్నటువంటి నగరి ఎమ్మెల్యే కి మంత్రి పదవి దక్కలేదని ఇప్పటికి కూడా వార్తలు చాలా వ్యాపిస్తున్నాయి… కానీ అనుకోకుండా ఏపీ సీఎం జగన్ నుండి నగరి ఎమ్మెల్యే రోజా కి ఫోన్ కాల్ వెళ్లిందని రోజా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు వెలగపూడిలో జరగబోయే జగన్ మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి రోజా తప్పకుండ హాజరు కావాలని జగన్ పిలిచారని సమాచారం. దీంతో వై.యస్.జగన్ మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే గత ప్రభుత్వంలో రోజా అధికారులకు ముచ్చెమటలు పట్టించిందని, రోజా వలన కొన్ని అధికారిక పనులు అన్ని కూడా సక్రమంగా జరిగాయని అందుకనే జగన్ తనకి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి… అంతేకాకుండా వైసీపీ తరుపున ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రోజాకు చివరి నిమిషయంలో మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వనున్నారని, అందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం.