ఫోటో టాక్ : షారుఖ్ కూతురి అందాల ఆరబోత!

Tuesday, March 27th, 2018, 05:22:51 PM IST

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్ త్వరలో బాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నట్లు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు కూడా. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా వుండే ఈ అమ్మడు పెట్టే పోస్టులకు వచ్చే లైకులు, కామెంట్లను గమనిస్తే మతి పోతుంది. అసలే కింగ్ ఖాన్ కుమార్తె ఆమాత్రం క్రేజ్ ఉండదా మరి, ఆ క్రేజ్ కి తగ్గట్టుగా క్రేజీ ఫోటోలు పెడుతూ తన ఫాలోవర్స్ ను ఆశ్చర్యపరుస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన స్నేహితురాలితో కలిసి అందాలను ప్రదర్శిస్తూ ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది సుహానా. ఈ ఫోటో చూసినవారంతా అవాక్కవుతున్నారు.

ఇంకా సినిమాల్లోకి రాకముందే ఇలా అందాల ప్రదర్శన చేస్తుంటే, ఇక వచ్చాక బాలీవుడ్ ని ఊపేయడం ఖాయమని అంటున్నారు చూసినవారందరూ. అయితే తాను ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్నట్టు కూడా చెప్పింది సుహానా. వాస్తవానికి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ లకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగే ఉంది. కానీ షారుక్ కూతురు మాత్రం వారి కంటే రెండాకులు ఎక్కువే చదివినట్లే వుంది. ఎందుకంటే ఇప్పటికే సుహానాకి ఫ్యాన్ క్లబ్ పేరిట చాలా అకౌంట్లు, సోషల్ మీడియా గ్రూపులు ఉండడం విశేషం. ఎంతైనా కింగ్ ఖాన్ కూతురా, మజాకానా మరి….