మహేష్ సినిమా ఫస్ట్ లుక్ .. సంచలనం ?

Thursday, February 9th, 2017, 11:02:16 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 23 వ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై సంచలనం రేపుతోంది? మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫస్ట్ లుక్ వైరల్ అయింది !! అవునా .. అదేంటి ఎప్పుడు రిలీజ్ చేశారు ? ఇంతకి ఏమి టైటిల్ పెట్టారని షాక్ అవుతున్నారా .. ? నిజానికి చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయలేదు … మహేష్ అభిమాని ఒకరు ఓ పోస్ట్ ని రూపొందించి దాన్ని సోషల్ మీడియా లో రిలీజ్ చేయడంతో అది సంచలనం రేపింది. మహేష్ నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ ను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. అయితే ఫ్యాన్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్ .. దాని ఒరిజినల్ పోస్టర్ ను పెట్టాడు .. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. అప్పుడే ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేస్తారట !!