పిక్ టాక్‌: అనుప‌మ వ‌ర్సెస్ రుక్షార్‌

Wednesday, April 11th, 2018, 10:49:26 PM IST

ఆన్‌సెట్స్ హీరో – హీరోయిన్ కెమిస్ట్రీ కుదిరితే ఆ సినిమా ఏ లెవ‌ల్ రిజ‌ల్ట్ అందుకుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. `హిట్ పెయిర్` అన్న మాట పుట్టిందే ఈ కెమిస్ట్రీ నుంచి. అయితే ఆన్ లొకేష‌న్ క‌థానాయిక – క‌థానాయిక మ‌ధ్య రొమాన్స్ కుదిరితే ఏమ‌నాలి? ఏమో ఇదిగో ఈ ఫోటో చూశాక మీరే ఏదో ఒక‌టి డిక్లేర్ చేయ‌డం ఖాయం.

అందాల క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ .. సాటి క‌థానాయిక రుక్షార్‌తో ఈ రేంజులో మింగిల్ అయిపోవ‌డం యూత్‌కి అస్స‌లు మింగుడుప‌డ‌డం లేదు. అక్కా చెల్లెళ్లుగా క‌లిసిపోయారు. ఆన్ ది స్పాట్ ఓ రేంజులో కెమిస్ట్రీ పండించేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ ఇద్ద‌రూ న‌టించిన `కృష్ణార్జున యుద్ధం` (12న రిలీజ్‌) రిజ‌ల్ట్ ఏంటో ఈ రాత్రికే రివీల్ కానుంది. ఇప్ప‌టికే చాలాచోట్ల ప్రీమియ‌ర్లు ప‌డిపోయాయ్. రేప‌టి ఉద‌యం క్రిటిక్స్ నుంచి రిపోర్ట్ అందుతుంది. ఇప్ప‌టికైతే ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ బ్లాక్‌బ‌స్టర్ అని ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. అయితే ఈ భామ‌లిద్ద‌రిలో ఎవ‌రు కృష్ణ‌తో, ఎవ‌రు అర్జున‌తో ఆడిపాడారు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments