న‌టుడు ఉత్తేజ్ కుమార్తె వెల్‌కం టీజ‌ర్‌..

Thursday, January 19th, 2017, 04:04:22 PM IST

uthej
న‌టుడు, ద‌ర్శ‌క‌ర‌చ‌యిత ఉత్తేజ్‌ త‌న న‌ట వార‌సురాలిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తున్న సంగ‌తి విధిత‌మే. చేత‌న ఉత్తేజ్‌.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా `బ‌ద్రి`లో బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై, సినిమాతో అనుబంధం పెంచుకున్నారు. ప్ర‌స్తుతం `పిచ్చిగా న‌చ్చావ్‌` సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. నేడు హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో `చేత‌న ఉత్తేజ్ వెల్‌కం టీజ‌ర్‌`ని `పెళ్లి చూపులు` నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేశారు. `పిచ్చిగా న‌చ్చావ్` టీజ‌ర్‌ని ఇదే వేదిక‌పై యువ‌న‌టుడు, అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజ‌ర్‌లో చేత‌న ఆక‌ట్టుకుంది. క‌థానాయిక‌గా రాణించాల‌ని ప‌లువురు వ‌క్త‌లు ఆకాంక్షించారు.

శ్రీ‌వ‌త్స క్రియేష‌న్స్ ప‌తాకంపై క‌మ‌ల్‌కుమార్ పెండెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.శ‌శిభూష‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీలా గంగాధ‌ర్‌, ఉద‌య్ శ‌ర‌త్‌, రాకేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సంగీతం: రామ్‌నారాయ‌ణ్‌, కెమెరా: వెంక‌ట హ‌నుమ‌.