పింక్ బాల్ టెస్ట్ లో 13 వికెట్ల తో అరుదైన రికార్డ్..!

Thursday, February 25th, 2021, 03:27:57 PM IST

ఇంగ్లాండ్ తో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో టీమ్ ఇండియా తన సత్తా చాటుతోంది. అయితే సరికొత్తగా ఆధునీకరణ చేసిన నరేంద్ర మోడీ స్టేడియం లో బుధవారం నాడు మ్యాచ్ ప్రారంభం అయిన తొలి రోజే అరుదైన రికార్డు నెలకొల్పింది. మొదటి రోజు జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్ లో 13 వికెట్లు పడగా, 211 పరుగులు నమోదు అయ్యాయి. అయితే ఇంగ్లాండ్ ఆల్ ఔట్ కాగా, భారత్ మూడు వికెట్ లని కోల్పోయింది. మైదానం ప్రారంభం అయిన తొలి రోజే ఈ రికార్డ్ నమోదు కావడం తో ఈ మొత్తం వ్యవహారం పై చర్చ జరుగుతుంది.

అయితే తొలి రోజు పింక్ బాల్ టెస్ట్ లో అత్యధిక వికెట్లు పడటం ఇది నాల్గవ సారి. అయితే భారత్ లో తక్కువ స్కోర్ కి తొలి ఇన్నింగ్స్ ఆల్ ఔట్ అవ్వడం ఇంగ్లాండ్ కి ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే ఇషాంత్ శర్మ తొలి వికెట్ ను తీయగా, అక్షర్ ఆరు వికెట్లు పడగొట్టారు. అశ్విన్ మూడు వికెట్లు తీయడం తో ఇంగ్లాండ్ 112 పరుగులకు ఆల్ ఔట్ అయింది. భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 99 పరుగులకు గానూ మూడు వికెట్లు కోల్పోయింది.