లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయాలట ?

Thursday, January 25th, 2018, 01:43:16 PM IST


టాలీవుడ్ రాక్షసి అలియాస్ అందాల భామ లావణ్య త్రిపాఠిని అరెస్ట్ చేయాలంటూ ఓ అభిమాని ఆమె ఫోటోను ట్విట్ చేస్తూ సోషల్ మీడియా లో పేర్కొన్నాడు? ప్రస్తుతం లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ సరసన ఇంటిలిజెంట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఎల్లో డ్రెస్ తో కనిపించింది. ఈ ఫోటోలను సదరు అభిమాని పోస్ట్ చేస్తూ లావణ్య ను వెంటనే అరెస్ట్ చేయండి .. ఎందుకంటే అందంగా ఉండడం నేరమైతే ఆమెను ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేయండి .. ఆమె తన అందంతో చంపేస్తుంది అని ఆమె ఫోటోని పోస్ట్ చేసాడు .. దానికి రిప్లయ్ గా లావణ్య హా హా హా మా నాన్న లాయర్ అంటూ కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అది విషయం !!