కరోనా వ్యాప్తి నివారణలో వైద్యుల పాత్ర కీలకం – మోడీ

Monday, June 1st, 2020, 01:05:17 PM IST

కరోనా వైరస్ ను అరికట్టడానికి రేయింబవళ్ళు కృషి చేస్తున్న వైద్యుల పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.ఈ మహమ్మారి ను అరికట్టడానికి వైద్యులు చేస్తున్న కృషి అత్యంత కీలకం అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.ఈ పోరు లో వైద్యులతో సహా సిబ్బంది అందిస్తున్న సేవలు కూడా అమూల్యమైన వి అని అన్నారు. కంటికి కనబడని ఈ కరోనా వైరస్ మహమ్మారి నీ తరిమి కొట్టేందుకు వీరు నిరంతరం గా పోరాడుతున్నారు అని వ్యాఖ్యానించారు.అయితే ఈ పోరు లో అంతిమ విజయం మాత్రం వైద్యుల దే అని మోడీ వ్యాఖ్యానించారు.

కర్ణాటక రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె వేడుకల్ని ప్రారంభించిన ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. వైద్యుల పై జరుగుతున్న దాడుల పై మోడీ పెదవి విప్పారు. ఇలా జరిగితే సహించేది లేదు అని అన్నారు.అయితే కర్ణాటక లో ఉన్న ఈ యూనివర్సిటీ మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని అన్నారు. అయితే కరోనా వైరస్ ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. కరోనా వైరస్ మహమ్మారి కోసం ఎంతగానో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని, వైద్య వ్యవస్థ ను పూర్తిగా మెరుగుపరిచి, యుద్ద ప్రాతిపదికన అమలు చేయాలని భావిస్తోంది అని అన్నారు.