ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు – కారణం ప్రధాని మోడీ వాఖ్యలేనా…?

Sunday, February 9th, 2020, 02:28:18 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విషయంలో కొన్ని సంచలనమైన వాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రధాని మోడీ చేసిన వాఖ్యలే ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయని సమాచారం. సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ బీజేపీ నేతలు అధికార తెరాస పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. కాగా వీరు చేస్తున్న విమర్శలే ఇప్పుడు వీరిని కొత్త సమస్యల్లోకి నెట్టుతున్నాయి. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు కి ఫిర్యాదు చేశారు.

అయితే వీరి ఫిర్యాదు చేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో జరిగిన ఘటనలను కూడా ఇప్పుడు బీజేపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు తెరాస నేతలు… అప్పట్లో బీజేపీ నేతల సహకారం వల్లే తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందని, ఇప్పుడు అనవసరంగా తప్పుడు విమర్శలు చేయొద్దని పలు హెచ్చరికలు చేశారు. రాష్ట్ర విభజనను తక్కువ చేసినందుకు గాను, తెలంగాణ రాష్ట్రంపై విమర్శలు చేస్తున్నందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి కూడా బీజేపీ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పుకోవాలని తెరాస నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజనను చిన్నదిగా చేసి చూడటం ప్రధానికి తగదు అని తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.