ప్రధాని మోడీ సంచలన నిర్ణయం – మరొక 21 రోజులు ఇంట్లోనే ఇక…?

Tuesday, March 24th, 2020, 09:11:50 PM IST

మన దేశ వ్యాప్తంగా భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఈ కరోనా వైరస్ ని అరికట్టడానికి భారత కేంద్ర ప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా నేటి అర్థరాత్రి 12 గంటల నుండి మరొక 21 రోజుల వరకు ఈ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రధాని మోడీ సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా ఇది జనతా కర్ఫ్యూ కంటే కూడా చాలా కఠినంగా ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎవరు బయటకు రాకూడదని, అందరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని ప్రధాని మోడీ అధికారికంగా ప్రకటించారు.

ఈ భయంకరమైన కరోనా వైరస్ కూడా ఇప్పుడు చాలా భయంకరంగా వ్యాపిస్తున్న కారణంగా ఈ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రధాని ప్రకటించారు. కాగా ఈ 21 రోజులు కూడా జాగ్రత్తగా ఉండకపోతే రానున్న రోజుల్లో జరగబోయే అనర్థాన్ని ఎవరు కూడా ఊహించలేమని, చాలా నష్టం జరుగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో నిత్యావసరాల సరఫరా ఎప్పటిలాగే ఉంటుందని, అందులో ఎవరు కూడా ఆందోళన చెందకండి అని ప్రధాని వెల్లడించారు. ఈ 21 రోజులు దేశ ప్రజలందరూ కూడా తమ సహాయాన్ని అందిస్తే కరోనా రక్కసిని అరికట్టవచ్చని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.