కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

Thursday, April 8th, 2021, 09:31:42 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ లోని ఎయిమ్స్ లో కరోనా వైరస్ టీకా రెండో డోస్ వేయించుకున్నారు. భారత్ బయోటెక్ కి చెందినటువంటి కోవాగ్జిన్ రెండవ డోస్ నేడు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్చి ఒకటవ తేదీన కోవాగ్జీన్ తొలి డోస్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ లో కరోనా వైరస్ ఉధృతి మరింత ఎక్కువగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ టీకా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా కరోనా వైరస్ టీకా తీసుకోవాలి అంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు మోడీ. ఇప్పటికే వందల సంఖ్యలో కరోనా వైరస్ మరణాలు, లక్ష కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం పట్ల ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.