దేశ ప్రధాని వరకు వెళ్లిన ఈ విషాద ఘటన..సీఎం జగన్ కు ఫోన్.!

Sunday, August 9th, 2020, 10:41:09 AM IST

గత కొంత కాలం నుంచి ఏపీలో ఎన్నో దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలా నేడు తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న మరో విషాధ సంఘటన కరోనా పేషంట్స్ ఉన్న ఆసుపత్రి ప్రమాదవశాత్తు కాలిపోవడం ఒక్క సారిగా ఏపీ ప్రజలను మరోసారి దిగ్భ్రాంతికి లోను చేసింది. దీనితో ముఖ్యమంత్రి సీఎం జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా..

ఈ విషాధ ఘటన అంశం దేశ ప్రధాని మోడీ వరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాని జగన్ కు ఫోన్ కూడా చేశారట. ఫోన్ చేసి మొత్తం వివరాలను అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ఒక్కో కుటుంబానికి భారీ ఎత్తున 50 లక్షల ఎక్స్ గ్రేషియా ను ప్రకటించినట్టుగా తెలిపారు. ఇప్పటికే ఏపీలో పరిస్థితులు చాలా ఛిద్రంగా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.