ఢిల్లీకి పోకముందే కేసీఆర్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోదీ

Friday, June 14th, 2019, 07:10:12 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకొని, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఛాన్స్ దొరికితే మోదీకే షాక్ ఇవ్వాలని ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు. కానీ ఇక్కడ కేసీఆర్ 9 కి పరిమితం అయితే, అక్కడ మోదీ తిరుగులేని మెజారిటీ సాధించాడు. ఇక తనకి దేశంలో చక్రం తిప్పే సత్తా లేదని గ్రహించిన కేసీఆర్ పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యాడు. ఇక కేసీఆర్ పాలనలో గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తూ, దానికి ముఖ్య అతిధులుగా మహారాష్ట్ర సీఎంని, ఆ రాష్ట్ర గవర్నర్ ని పిలవటానికి మహారాష్ట్ర వెళ్లి అటు నుండి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కూడా పిలవాలని అనుకున్నాడు, కానీ అనుకోని కారణాలు వలన తన ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వచ్చాడు.

ఈ నెల 16 వ తేదీ ఢిల్లీ వెళ్లి, ప్రధానిని కలవాలని అనుకోని అయన ఆపాయిన్మెంట్ కోసం టైం అడిగారు, అయితే కేసీఆర్ కి అనుకోని సమాధానం ప్రధాని కార్యాలయం నుండి వచ్చింది. 16వ తేదీ ప్రధాని ఆపాయిన్మెంట్ దొరకటం కష్టమని చెప్పారు. ఒక్కప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి ప్రధాని మోదీని కలిసి వచ్చిన కేసీఆర్ కి ఇప్పుడు కనీసం ఆపాయిన్మెంట్ కూడా దొరకని పరిస్థితి వచ్చింది. నిజానికి కేసీఆర్ ముందుగా ఢిల్లీ వెళ్లాలని అనుకోని, మళ్ళి దానిని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ రోజు ఢిల్లీ వెళ్లి, రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని 16 వ తేదీ ప్రధానిని కలవాలని అనుకున్నాడు, ప్రధాని ఆపాయిన్మెంట్ దొరకపోయేసరికి, టూర్ మధ్యలో ముగించుకొని హైదరాబాద్ వచ్చాడని మనం అనుకోవచ్చు. ఇక మోదీ ఆపాయిన్మెంట్ ఇవ్వకపోవటానికి కారణాలు చాలా గట్టిగానే ఉన్నాయని తెలుస్తుంది.