వేలి ముద్రతో సెటిల్ చేసుకోండి..భీమ్ యాప్ ని లాంచ్ చేసిన మోడీ..!

Friday, December 30th, 2016, 05:58:11 PM IST

modi
డిజిటల్ లావాదేవీలను కొత్త పుంతలు తొక్కించడానికి ప్రధాని మోడీ నడుం బిగించారు. ఢిల్లీలో తలాక్ తోరా మైదానంలో డిజి ధన్ మేళా కార్యక్రమం లో ఆయన ‘భీమ్’ అనే సరికొత్త మొబైల్ యాప్ ని ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలు జరపవచ్చని మోడీ తెలిపారు. ఎలాంటి మొబైల్ నుంచైనా కేవలం మీ వేలి ముద్ర ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేయవచ్చని మోడీ తెలిపారు.మొబైల్ మీ చెంత ఉంటే బ్యాంకు మీ జేబులో ఉన్నట్లే అని మోడీ అన్నారు. రెండువారాల్లో వేలిముద్ర ద్వారా చెల్లింపులు జరిగేలా చూస్తామని మోడీ అన్నారు. డిజిటల్ అనుసంధానాల వలన దేశం లో అద్భుతాలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఈ సంద్భర్భంగా రాహుల్ గాంధీకి పరోక్షం గా చురకలంటించారు. పెద్ద నోట్ల రద్దు పై రాహుల్ మోడీ తీరుని తీవ్రంగా తప్పుబడుతున్న విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా మోడీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గతం లో బొగ్గులో ఎంతపోయింది, 2జి లో ఎంతపోయిందని ప్రజలు చర్చించుకునేవారని.. కానీ ప్రస్తుతం ఎంత డబ్బు వచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారని మోడీ అన్నారు. దేశం లో కొందరు నిరాశావాదులు ఉన్నారని వారికి తన వద్ద మందు లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ అన్నారు. ఆశావాదుల కోసం తన వద్ద అవకాశాలు ఉన్నాయని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్ లావాదేవీల పై అవగాహనా కల్పించిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. వీరిలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ. బాబు కూడా ఉండడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments