కోవాగ్జిన్ తొలి డోసు టీకా తీసుకున్న మోడీ… అర్హులందరూ తీసుకోవాలని విజ్ఞప్తి

Monday, March 1st, 2021, 08:30:33 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఉదయం కరోనా వైరస్ మహమ్మారి కి టీకా వేయించుకున్నారు. మన దేశం లో రెండవ దశ కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ నేటి నుండి మొదలు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. 60 ఏళ్లు పై బడిన వారందరికీ, 45 ఏళ్ల వయస్సు కలిగిన వారి నుండి 59 ఏళ్ల వయస్సు కలిగి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నేటి నుండి టీకా ఇవ్వనున్నారు. అయితే ఈ నేపథ్యం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ ఎయిమ్స్ లో తొలి డోసు టీకా వేయించుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక గా ప్రధాని నరేంద్ర మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి నీ నరేంద్ర మోడీ కొనియాడారు. అంతేకాక అర్హులు అందరూ కూడా కోవిడ్ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్ ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదాం అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు నరేంద్ర మోడీ. ఢిల్లీ ఎయిమ్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ కోవాగ్జిన్ టీకా తొలి డోస్ వేయించుకున్నారు. ఎయిమ్స్ కి చెందిన సిస్టర్ నివేదా మోడీ కి సిరంజి ద్వారా టీకా వేశారు.