పోలవారానికి మహార్దశ

Tuesday, December 27th, 2016, 11:55:40 AM IST

polavaram
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం కి కేంద్రం ఇప్పుడు భారీగా నిధులు మంజూరు చెయ్యడం విశేషం. ఇదివరకు ఇచ్చిన నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్ట్ మంజూరు అయిన మొదటి దశలో 1981 కోట్ల చెక్కు ని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అందించింది. ఢిల్లీలో జరిగిన నాబార్డు సమావేశంలో ఈ నిధులకు సంబంధించిన రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబు అందుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నాబార్డు నిధులు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం.ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా 80లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా ఉందని ప్రాజెక్టులు-రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని ఉమాభారతి ప్రశంసించారు. పోలవరం నిధుల సాధన విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికావాలంటే నిధులు అవసరమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు నాబార్డు ద్వారా నిధులు ఇచ్చినట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధికి అన్నిరకాలా సాయం అందిస్తున్నామని జైట్లీ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments