శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

Thursday, July 23rd, 2020, 11:29:02 PM IST

గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ లతో తనకు అఫైర్ ఉందంటూ సునిశిత్ పలు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యక్తి యూ ట్యూబ్ చానెల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలాంటి విషయాలే ఎక్కువగా వ్యాఖ్యానించడం కారణంగా ప్రముఖ సినీ నటీ లావణ్య త్రిపాఠి త్రిపాఠి పోలీస్ కేసు పెట్టారు. అయితే పలు స్టేషన్ లలో అతని పై పోలీస్ కేసులు నమోదు కాగా తాజాగా అతనిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

ప్రముఖ హీరోల సినిమాల విషయం లో కూడా అలానే చేశారు. వారి కంటే ముందే తనకు సినిమా లో అవకాశం వచ్చింది అని, కానీ తనను ఇండస్ట్రీ లో ఎదగ నీయకుండా లాక్కున్నారు అని పలు వ్యాఖ్యలు చేశారు. అయితే కొందరు హీరోయిన్లు తనను ప్రేమించారు అని, ఇంకొందరు పెళ్లి వరకు వచ్చారు అని చాలా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తనకి సోషల్ మీడియా శక్రిఫైజ్ స్టార్ అంటూ కూడా బిరుదు ఇవ్వడం జరిగింది. అయితే ఇపుడు పోలీసులు అరెస్ట్ చేయడం తో మరొకసారి హాట్ టాపిక్ గా మారారు.