తెరాస నేత ని సైబర్ నేరం కింద అరెస్ట్ చేసిన పోలీసులు

Wednesday, February 12th, 2020, 10:47:52 AM IST

రాష్ట్రంలో రకరాలుగా పలు సైబర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామ తెరాస అధ్యక్షుడు కందగట్ల భాస్కర్ ని సైబర్ పోలీసులు అరెస్ట్ చేసారు. యువతులతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడటం, అసభ్యకర చిత్రాలు, వీడియో సందేశాలు పంపించడం తో అతని ఫై ఫిర్యాదు నమోదయింది. బీసీ కార్పొరేషన్ ఋణం కోసం దరఖాస్తు చేసుకున్న ఇతను, అక్కడి అధికారులతో చనువుగా మెలిగాడు. కార్యాలయం పోర్టల్ వివరాలు తెల్సుకొని రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతుల ఫోటోలు, నంబర్లు,అడ్రెస్స్ సేకరించాడు.

అయితే వివరాలు సేకరించిన భాస్కర్ తాను ఎంపికచేసిన వారికే అధికారులు రుణాలు ఇస్తారని మాయమాటలు చెప్పాడు. ఉపాధి యూనిట్లు, ఉద్యోగాలు కేటాయిస్తారని తెలియజేసాడు. అక్కడినుండి వాట్సాప్ ద్వారా మెస్సేజ్ లు , అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపాడు. అంతేకాకుండా వీడియో కాల్ లో తాను చేసినట్లు చేయాలంటూ బలవంతం చేసేవాడని పోలీసులు తెలిపారు. సదరు ఒక బాధితురాలు పోలీస్ శాఖలో పనిచేసే స్నేహితురాలి కి ఈ విషయం తెలియజేయడం తో అతనిని పట్టుకోవడం సులువైంది. అతని ఫై 2018, 2019 లలో కేసులు నమోదయ్యాయి. 2007 లో ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించుట వలన రెండేళ్లు జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించారు.