రవిప్రకాష్ అరెస్టుకు సిద్దమైన పోలీసులు…

Saturday, June 8th, 2019, 12:37:27 AM IST

గతకొంత కాలంగా నేరారోపణలు ఎదురుకుంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులు… ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో రవి ప్రకాష్‌నుంచి కీలక ఆధారాలను రాబట్టిన పోలీసులు ఆరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రవిప్రకాష్ బంజారాహిల్స్ లోని పొలిసు స్టేషన్ లో విచారణకు హాజరైనప్పటికీ కూడా అక్కడ ఎలాంటి సమాచారం పోలీసులు రాబట్టలేకపోయారని సమాచారం. అంటే రవిప్రకాష్ ఎలాంటి సమాదానాలు చెప్పడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. అంతేకాకుండా అసలు రవిప్రకాష్ పోలీసులకు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు. అయితే యాజమాన్యం మార్పిడి తర్వాత టీవీ9 లోగో కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవి ప్రకాష్ కుట్ర పన్నారు. లోగో అక్రమ విక్రయం కేసులో రవి ప్రకాష్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే పలు విషయాలమీద రవిప్రకాష్ ని మూడు రోజుల పాటు విచారించినప్పటికీ కూడా ఎలాంటి సమాదానాలు కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. కాగా మూడు రోజుల విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. రవి ప్రకాష్‌కు పెన్ను, పేపర్ ఇచ్చి గంట సేపు పరిశీలించారు. అతడు పేపర్‌పై రాసిన విధానాన్ని‌ బట్టి అతని మానసిక స్థితిని, చేతి రాతను పరిశీలించారు. ఫోర్జరీ విషయంలో రవి ప్రకాష్ చేతి వ్రాతను సేకరించారు. దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. ఇవన్నీ పరిశీలించిన పిదప అధికారులు రవిప్రకాష్ ని అరెస్టు చేయాలనీ పోలీసులను ఆదేశించారని, అందుకు తగినట్లే పోలీసులు కూడా రవిప్రకాష్ ని అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం…