వర్మపై పోలీస్ కేసు నమోదు ?

Tuesday, January 23rd, 2018, 11:03:14 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసారు. వర్మ ప్రస్తుతం జీఎస్టీ పేరుతొ బూతు చిత్రాన్ని తీస్తున్నాడని బిజెపి మహిళా మోర్చా నేతలు పోలీసులకు పిర్యాదు చేసారు. నీలి చిత్రాల్లో నటిస్తున్న నటి మియా మాల్కోవా తో వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రుథ్ అంటూ చెత్త సినిమా తీస్తున్నాడని వారు మండి పడ్డారు. ఈ విషయంలో వర్మ పై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇదివరకే విజయవాడ లోకూడా బిజెపి మహిళా మోర్చా నేతలు కేసు పెట్టిన విషయం తెలిసిందే. వర్మ తన తీరు మార్చుకోకపోతే తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. మరి ఈ విషయం పై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.