బీజేపీ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు

Wednesday, November 25th, 2020, 12:00:55 PM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ప్రత్యర్థుల పై ఒకరి మీద మరొకరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు బీజేపీ కి చెందిన నేత, ఎంపీ అరవింద్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ సమీపంలో తెరాస నేతలకు సంబంధించిన ఫ్లెక్సీ లను చించివేసిన ఘటనకు సంబంధించి ఎంపీ అరవింద్ పై సెక్షన్ 504,506, 427 కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే తెరాస లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ పైన మరియు కార్యకర్తల పై కేసు నమోదు అయింది. అయితే నిన్న ప్రచారం లో బాగంగా ఎంపీ అరవింద్ అధికార పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెరాస గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తో మూతపడిపోవడం ఖాయం అని అన్నారు. కరీం నగర్, నిజామాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఎలా అయితే నిజాయితీ గా ఓటు వేశారో,అలానే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయాలి అని ప్రజలకు ఎంపీ విజ్ఞప్తి చేశారు. అంతేకాక బీజేపీ కి ఓటు వేసి మార్పుకి నాంది పలకాలి అంటూ ప్రజలను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తో రాష్ట్ర రాజధాని వేడెక్కింది. ఒక పక్కన తెరాస మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు వరాల జల్లు కురిపించగా, మరో పక్క కాంగ్రెస్, బీజేపీ లు తెరాస కి గట్టిగా కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాయి.