నారా లోకేష్, చంద్రబాబు లపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు

Sunday, April 11th, 2021, 08:55:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో అధికార పార్టీ , ప్రతి పక్ష పార్టీ లకి మధ్య మాటల యుద్దాలు నడుస్తున్నాయి. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ సైతం అధికార వైసీపీ పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుండి తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కి వైసీపీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధి గురుమూర్తి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు తనయుడు లోకేశ్ ల పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయింది. అయితే గురుమూర్తి తో పాటుగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కించ పరిచే విధంగా పోస్ట్ ఉందని వైసీపీ నేతలు తెలియజేశారు.

అయితే వైసీపీ నేతలు అయిన నందిగం సురేష్, మేరుగ నాగార్జున, కైలే అనిల్ కుమార్ లు డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదు పై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ల పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు పెట్టడం పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.