ఏపీ మంత్రి కొడాలి నానిపై పోలీస్ కేసు పెట్టిన నారావారిపల్లి గ్రామస్థులు..!

Tuesday, May 11th, 2021, 05:53:25 PM IST


ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై పోలీసు కేసు నమోదయ్యింది. కర్నూల్ జిల్లాలోని వైరస్ వేరియంట్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అలాగే మంత్రి సీదిరి అప్పల రాజుపై పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే చంద్రబాబుపై కొడాలి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కొందరు టీడీపీ నేతలు కొడాలి నానిపై కేసు పెట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి స్వగ్రామం నారావారిపల్లె పంచాయతీ అయిన కందులవారిపల్లె గ్రామస్థులు కొందరు కొడాలి నానిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారా 420 వైరస్ నారావారిపల్లిలో పుట్టిందని అవమానకరంగా మాట్లాడడం బాధకరమని, అంతేకాకుండా నారావారిపల్లిలో 70 ఏళ్ల క్రితమే నారా 420 వైరస్ పుట్టిందని గ్రామాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.